: హెలికాప్టర్ లో బెంగళూరుకు బయల్దేరిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగిసింది. కుప్పంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేసిన బాబును ఇవాళ ఉదయం పలువురు పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కలిసి వినతిపత్రాలు అందజేశారు. అక్కడి నుంచి చంద్రబాబు హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆయన బెంగుళూరు మీదుగా విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.