: కేంద్రానికి నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటయిన శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. అయితే, నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంలో కమిటీ స్పష్టత ఇవ్వలేదు. రాజధానికి అనువైన ప్రాంతాలుగా విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, విశాఖ, గుంటూరు, కర్నూలును కమిటీ పేర్కొంది. రాజధానికి కావాల్సిన అన్ని హంగులూ విశాఖ నగరానికి ఉన్నాయని ఈ నివేదికలో వెల్లడించారు.