: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్
ఈ వేసవిలో మండే ఎండలతో అల్లాడి... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నైరుతి జల్లులు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా రుతుపవనాలు విస్తరించనున్నాయని అధికారులు చెప్పారు. రాయలసీమలో ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించినా, కోస్తాంధ్రలో ఇప్పటికీ వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. మరో వైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.