: బాబు తీరును తెలంగాణ టీడీపీ నేతలు గమనించాలి: కొప్పుల ఈశ్వర్


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరును తెలంగాణ టీడీపీ నేతలు గమనించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రుణమాఫీపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో దీనిని పరిశీలిస్తే అర్థమవుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ టీడీపీ నేతలు గురివింద చందంగా రైతు రుణమాఫీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పోలవరం ఆర్డినెన్స్ పాపం ముమ్మాటికీ చంద్రబాబునాయుడిదేనని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కు ఏడాది గడువిస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఆయన విజన్ ఉన్న నాయకుడని కొప్పుల ప్రశంసించారు.

  • Loading...

More Telugu News