: విదేశీ కంపెనీలూ... తక్షణం దేశం విడిచి వెళ్లండి: తాలిబన్ల హెచ్చరిక


విదేశీ కంపెనీలకు పాకిస్థానీ తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ లో ఉన్న విదేశీ కంపెనీలన్నీ తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని పాక్ లో తాలిబన్ల ప్రతినిధి షహీదుల్లా షహీద్ శాసించాడు. మొత్తం విదేశీ పెట్టుబడులు, విమానయాన సంస్థలు, బహుళ జాతి సంస్థలు తక్షణం పాకిస్థాన్ లో జరుపుతున్న లావాదేవీలన్నీ ఆపేసి దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రకటించాడు. లేని పక్షంలో జరిగే నష్టానికి వారే బాధ్యులని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఉత్తర వజీరిస్థాన్ లోని గిరిజన జిల్లాల్లో తాలిబన్లకు చాలా గట్టిపట్టుంది. కరాచీ ప్రధాన విమానాశ్రయంపై ఉగ్రదాడుల తరువాత ఆదివారం రాత్రి నుంచి పాక్ సైన్యం ఉత్తర వజీరిస్థాన్ లో ఆపరేషన్లు మొదలు పెట్టింది. సైన్యం దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేస్తూ, విదేశీ కంపెనీలకు తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News