: ఇక ఇంటర్ లోనూ న్యాయవిద్య


ఇప్పటి వరకూ డిగ్రీ స్థాయిలోనే ఉన్న న్యాయవిద్య తొలిసారిగా ఇంటర్ స్థాయిలో అందుబాటులోకి రానుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఈ) పదకొండు, పన్నెండో తరగతులలో లా కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా దేశ, విదేశాలలోని 200 స్కూళ్లలో ఈ కోర్సును అందుబాటులో తీసుకొస్తారు. అయితే ఇది పూర్తి స్థాయి లా కోర్స్ కాదు. విద్యార్థులు ఒక లా సబ్జెక్ట్ తోపాటు తమకు ఇష్టమైన మరో మూడు సబ్జెక్ట్ లను, ఒక లాంగ్వెజ్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులు 21వ శతాబ్దంలో లాలో మరిన్ని అవకాశాలు పొందేందుకు వీలుగా దీనిని హైస్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సిబిఎస్ఈ వెల్లడించింది. ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యతన 200స్కూళ్లకు ఈ కోర్సు విషయంలో అనుమతి ఇస్తామని సిబిఎస్ఈ చైర్మన్ వినీత్ నాయర్ తెలిపారు. ఇదే విషయమై సిబిఎస్ఈ తన పరిధిలోని స్కూళ్లకు లేఖలు రాసింది.

  • Loading...

More Telugu News