: చంద్రబాబుకి, మాకు మధ్య 35 ఏళ్ల అనుబంధం: ఆనం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో 35 ఏళ్ల అనుబంధం ఉందని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతంలో టీడీపీలో పనిచేసిన సందర్భంగా ఏర్పడిన సత్సంబంధాలు నేటికీ ఉన్నాయని అన్నారు. తమకు టీడీపీ నుంచి ఆహ్వానం అందలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తగలడంతో పాటు కాంగ్రెస్ వైపు నేతలే తప్ప కార్యకర్తలు చూసే పరిస్థితి లేకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా నెల్లూరులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. టీడీపీలో చేరే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.