: కేదార్ నాథ్ లో 17 అస్థిపంజరాలు బయటపడ్డాయ్


ఉత్తరాఖండ్ ప్రకృతి విలయం సంభవించి ఏడాది అయినా... మరణించిన వారి అస్థిపంజరాలు బయటపడుతూనే ఉన్నాయి. కేదార్ నాథ్ ప్రాంతంలోని జంగ్లీచట్టీ ప్రాంతంలో మరో 17 మంది అస్థిపంజరాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. డీఎన్ ఏ నమూనాలు సేకరించిన అనంతరం వాటికి అంత్యక్రియలు నిర్వహించామని రుద్రప్రయాగ ఎస్పీ చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 35 అస్థిపంజరాలు లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. మరో వైపు గాలింపు చర్యలు ముమ్మరం చేసేందుకు ఐజీపీ సంజయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించింది.

  • Loading...

More Telugu News