: సోనియాగాంధీకి కర్ణాటక హైకోర్టు నోటీసు


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కర్ణాటక హైకోర్టు నోటీసు జారీ చేసింది. మే 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్లు కోరుతున్న పార్టీ సభ్యులు ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు సేకరించారని కాంగ్రెస్ అభ్యర్ధి వి.శశిధర్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని ఈరోజు విచారణ చేపట్టిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. సోనియాతో పాటు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర, ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News