: ఏపీ రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
నేదురుమల్లి జనార్థనరెడ్డి మృతితో ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన ఒక రాజ్యసభ, తమిళనాడు 1, ఒడిశాలో 2 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జులై 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.