: కుక్క కాటుకు చెప్పు దెబ్బ: మమతా బెనర్జీ
బీజేపీ నాయకత్వానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు కారణం.. ఆ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులు పెరిగిపోవడమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులతో కూడిన రెండు బృందాలను ఆ రాష్ట్రానికి పంపింది. దీంతో తాను కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకు తమ ఎంపీలను పంపుతానని మమతాబెనర్జీ హెచ్చరించారు. ఇకపై బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏం జరిగినా అక్కడ తమ ఎంపీలు ఉంటారని చెప్పారు. వాళ్లు ఏది చేస్తే తిరిగి అదే వాళ్లకు ఎదురవుతుంది. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా అని ఆమె హెచ్చరించారు.