: ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ధర్నా, అరెస్ట్
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తీవ్ర విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టారు. నంగ్లోయి రైల్వే స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ నేత అరవింద్ సింగ్, డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం కూడా ఇక్కడ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులను నీటి ఫిరంగులతో పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు కాంగ్రెస్ నేతల ఆందోళనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలన వల్లే ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని వారు ఆరోపించారు.