: తెనాలిలో మహిళను బలితీసుకున్న మందుబాబులు
మద్యం మత్తులో మధమెక్కి, కామంతో కళ్లు మూసుకుపోయిన కిరాతకులు ఓ మహిళ ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకున్నారు. తెనాలిలో నిన్న అర్ధరాత్రి సుశీల, బిటెక్ చదువుతున్న తన కూతురుతో కలిసి ఇంటికి వెళుతుండగా గాంధీ చౌక్ వద్ద మందుబాబులు అడ్డుకున్నారు. సుశీల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని అడ్డుకున్నందుకు సుశీలను బలంగా తోసేయడంతో అటుగా వస్తున్న లారీ కింద పడి తీవ్ర గాయాలయ్యయి. మంగళగిరి సమీపంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆమె కన్ను మూసింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.