: ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరుగనున్నాయా?
ఢిల్లీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయా? అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే అవుననే జవాబు చెప్పాల్సి వస్తోంది. మళ్లీ ఎన్నికలకు వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ కన్పించకపోవడంతో ఆరు నెలల లోపే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మూడూ ఈ ఎన్నికల్లో తిరిగి తమ తమ బలాలను చూపనున్నాయి. గత ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి ఆధిపత్యం లభించకపోవడం, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏఏపీ 49 రోజులకే విరమించుకోవడం తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.