: ఐపీఎల్ లో ఈ రోజు మ్యాచ్ లు
ఐపీఎల్-6 సీజన్ క్రికెట్ ప్రియులను కట్టిపడేస్తోంది. స్టేడియంలో ప్రేక్షకులను, టీవీ ముందునుంచి అభిమానులను కదలకుండా కూర్చోబెడుతోంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరు వేదికగా 'బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- హైదరాబాద్ సన్ రైజర్స్' జట్లు తలపడబోతున్నాయి. అనంతరం 8 గంటలకు ముంబయి వేదికగా 'ముంబయి ఇండియన్స్-ఢిల్లీ డేర్ డెవిల్స్' జట్ల పోరు మొదలవుతుంది.
ఇదిలావుంటే, నిన్న సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డిపెడింగ్ ఛాంపియన్ రైడర్స్ జట్టు తొలి పరాజయాన్ని చూసింది. రాయల్స్ జట్టు 144 పరుగులకు 6 వికెట్లు నష్టపోగా, కోల్ కతా 19 ఓవర్లలో 125 పరుగులుచేసి ఆలౌట్ అయింది.