: బంగ్లాదేశ్ లో చెలరేగిన ఘర్షణలు, 10 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మీర్ పూర్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. బెంగాలీలకు, బీహారీ ముస్లిం కుటుంబాలకు జరిగిన ఘర్షణల్లో 10 మంది మరణించారు. చనిపోయిన వారందరూ బీహారీలేనని తెలిసింది. అల్లర్లకు కారణం తెలియాల్సి ఉందని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.