: రక్తంలో అది లేకుండా.. స్మోకింగ్ అంటే చావే!
రక్తంలో ఉండే అనేకానేక పదార్థాల్లో బిలురూబిన్ అనే పదార్థం కూడా ఒకటి. రక్తంలో బిలురూబిన్ మోతాదు ఉండాల్సిన దానికంటె తక్కువగా ఉన్నట్లయితే గనుక... సదరు వ్యక్తులకు పొగతాగే అలవాటు కూడా ఉంటే కచ్చితంగా మరణం ప్రాప్తిస్తుందిట. ఇలాంటి వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకుతుంది. ఈ అధ్యయనాన్ని టెక్సాస్ యూనివర్సిటీ సైంటిస్టు క్సిమెంగ్ వూ పేర్కొన్నారు. ధూమపానాన్ని మానేస్తే క్యాన్సర్ బెడద తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.