: గోవా ప్రజాప్రతినిధుల పర్యటన రద్దు
గోవాకు చెందిన ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల బ్రెజిల్ పర్యటన ప్రభుత్వం రద్దు చేసింది. బ్రెజిల్ లో ఫుట్ బాల్ మ్యాచులను చూసేందుకు, అక్కడి క్రీడా వసతులపై అధ్యయనం చేసేందుకు వీరిని పంపాలని గోవా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.89 లక్షల ప్రజాధనాన్ని వినియోగిస్తుండడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీంతో తమ పర్యటనను రద్దు చేసినట్లు గోవా మత్స్యశాఖ మంత్రి అవెర్టనో ఫుర్టాడో తెలిపారు.