: భారత నౌకాదళానికి విక్రమాదిత్య అతిపెద్ద నౌక కానుంది : మోడీ
భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అతిపెద్ద నౌక కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యుద్ధవీరుల గౌరవార్ధం స్మారక చిహ్నం నిర్మిస్తామని తెలిపారు. త్వరలో ఒకే హోదా, ఒకే పింఛను విధానాన్ని అమలు చేస్తామని గోవాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెప్పారు. దేశ ప్రగతికి పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతికత తప్పకుండా అవసరమన్నారు. దేశ భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తామని మోడీ స్పష్టం చేశారు.