: ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూమిని వెతుకుతున్నాం: మంత్రి కేఈ కృష్ణమూర్తి


రాష్ట్రంలో జరిగిన భూకేటాయింపులన్నింటినీ సమీక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ముఖ్యంగా వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి, రాజధాని నిర్మాణం కోసం భూమిని వెతుకుతున్నామన్నారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే విధంగా భూములను తీర్చిదిద్దుతామని, రైతులకు, ప్రజలకు మేలు కలిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే భూములు వెనక్కి తీసుకుంటామన్నారు. అటు అన్యాక్రాంతమైన భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడతామన్నారు.

  • Loading...

More Telugu News