: ఖమ్మంలోని తండాలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం


ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని మద్రాస్ తండాలో దారుణం చోటుచేసుకుంది. తండాకు చెందిన సునీత అనే 16 ఏళ్ల బాలికపై అదే తండాకు చెందిన ఆరుగురు కామాంధులు విరుచుకుపడ్డారు. బాలికపై అత్యాచారం చేసిన అనంతరం ఆరుగురు యువకులు పరారయ్యారు. బాలిక ఇల్లు చేరుకుని తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం జిల్లా అసుపత్రికి తరలించారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News