: నేడు చంద్రబాబుతో భేటీ అవుతున్న శివరామకృష్ణన్ కమిటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజధాని ఏర్పాటు కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ భేటీ అవుతోంది. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వ ఆలోచన ఏమిటనే విషయాన్ని ఈ సమావేశంలో కమిటీ తెలుసుకోనుంది. ఇప్పటికే ఈ కమిటీ రాయలసీమ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించింది. గుంటూరు-విజయవాడను కలుపుతూ రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని కమిటీకి సీఎం చంద్రబాబు వివరించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News