: మూత్రపిండాల రోగులకు శుభవార్త
మూత్రపిండాలకు సంబంధించిన రోగాలు ముదిరినప్పుడు ఏకంగా ప్రాణాంతకంగా మారుతుండడం చాలా సహజమైన విషయం. దీనికి సరైన నికరమైన చికిత్స కూడా లేదు. వీరికి వ్యాధిని నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఓ నవీన ఆవిష్కరాన్ని సాధించారు. వెల్ 'నెగటివ్ అనే అరుదైన గ్రూపు రక్తం జన్యువును తెలుసుకోవడం ద్వారా.. ఇలాంటి వ్యాధిగ్రస్తుల జీవితాల్లో ఆనందం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
5000:1 అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా క్లిష్టమైన శాంపిల్ కింద లెక్క. అలాంటిదే వెల్ నెగిటివ్ రక్తం కూడా. ఈ గ్రూపు రక్తం 5వేల మందిలో ఒకరిలోనే దొరుకుతుంది. ఈ గ్రూపు రక్తం ఉండే వారిలో రక్తమార్పిడి సందర్భాల్లో మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడీ జన్యువును కనుగొనడం వలన లోపం గల వ్యక్తులను గుర్తించేందుకు మెరుగైన డీఎన్ఏ పరీక్షలను అభివృద్ధి చేస్తారు.