: వర్గ పోరుతో సంక్షోభం అంచున ఇరాక్...సైనిక చర్యకు అమెరికా రెడీ
ఇరాక్ లో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. షియా, సున్నీ వర్గాల మధ్య పోరు రావణకాష్టంలా రగులుతోంది. ఇరాక్ లోని అనేక పట్టణాలను సున్నీ తీవ్రవాదులు స్వాధీనం చేసుకోవడంతో ఇరాక్ సంక్షోభం అంచున నిలిచింది. సున్నీలు ఇరాక్ రాజధాని బాగ్ధాద్ దిశగా కదులుతున్నారు. సున్నీ తీవ్రవాదుల దాడులతో కకావికలమైన ఇరాక్ భద్రతా బలగాలు ఆత్మరక్షణలో పడ్డాయి.
మరోవైపు ఆయుధాలు సేకరించి సున్నీల దాడులను తిప్పికొట్టాలని షియా వర్గ మతపెద్దలు పిలుపునిచ్చారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో ఇరాక్ అట్టుడుకుతోంది. ఇరాక్ లో రక్తపుటేర్లు పారడంతో పరిస్థితి చేజారుతోందని గ్రహించిన అమెరికా, భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతోంది. సైనికచర్య తీసుకునేందుకు ఇరాక్ సరిహద్దు దేశాల్లో అమెరికా సైన్యాన్ని సిద్ధంగా ఉంచింది.