: విత్తన వ్యాపారులపై వ్యవసాయ శాఖ అధికారుల దాడులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విత్తన వ్యాపారులపై వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విత్తన వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్ అధికారుల రాకను ముందే పసిగట్టిన దాదాపు 50 మంది దుకాణదారులు షాపులు బంద్ చేసి పరారయ్యారు. షాపులు మూసివేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎడిఎ నిర్మల తెలిపారు.