: లోక్ సభ ఎన్నికల్లో ఓడినందుకు నిరాశపడొద్దు: సోనియా
2014 లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓడిన ఎంపీలు, నేతలు నిరుత్సాహపడొద్దంటూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వారికి లేఖ రాశారు. ఎన్నికల్లో గెలుపొందుతామని భావించానని... కానీ, అది జరగలేదని పేర్కొన్నారు. అయితే, నేతలంతా తమతమ నియోజకవర్గాల ప్రజలతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలని సూచించారు. అంతేగాక మనకు (కాంగ్రెస్) ఓటు వేసిన వ్యక్తులకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ విధానాలు, ముఖ్య పథకాల గురించి చెబుతూ ఉండాలని ఎంపీలకు వివరించారు. నేతలు ఇలా చేసి తమ ప్రాంతాల్లో కాంగ్రెస్ ను పునరుద్ధరించాలన్నారు.