: శంషాబాద్ చేరుకున్న అరవింద్, ఉపేందర్ మృతదేహాలు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సహాయక బృందాలు వెలికితీసిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలించారు. అరవింద్, ఉపేందర్ మృతదేహాలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. విద్యార్థుల ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.