: కరవు పరిస్థితులు వస్తున్నాయ్... ఎదుర్కోవడానికి రెడీ: కేంద్ర మంత్రి
సాధారణం కంటే తక్కువ వర్షపాతంతో కరవు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. తక్కువ వర్షపాతం కారణంగా ఏర్పడే పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. రైతులకు పరిహారంతోపాటు, సబ్సిడీ డీజిల్, తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తగినంత సరుకులు ఉన్నాయని, ధరలను అదుపు చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని అన్నారు.