: ఫీఫా ఫుట్ బాల్ సంగ్రామానికి బ్రెజిల్ సిద్ధం
బ్రెజిల్ లో ఇవాళ రాత్రి నుంచి ప్రారంభమవుతోన్న ఫీఫా ఫుట్ బాల్ సంగ్రామానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ దేశాల నుంచి అబిమానులు బ్రెజిల్ కు చేరుకుంటున్నారు. దీంతో బ్రెజిల్ లోని పలు నగరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని సాకర్ క్రీడాభిమానులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భారత్ లోని సైకత శిల్పి (ఇసుకతో బొమ్మలు రూపొందించే కళాకారుడు) సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో బ్రెజిల్, క్రయోషియా దేశాల జెండాలతో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించాడు.