: ఫేస్ బుక్ లో మీ పాప్యులారిటీ సూపరా.. అయితే ఇదిగో జాబ్!


నేటితరం యువత తమ అభిప్రాయాలు పంచుకోవడానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను విరివిగా వినియోగించడం తెలిసిందే. ఇప్పుడా అలవాటు ఉద్యోగానికి బాటలు పరచడంలో కీలకపాత్ర పోషించనుంది. ఎలాగంటారా? పలు కంపెనీలు అభ్యర్థుల ప్రొఫైల్ పై ఓ లుక్కేసేందుకు ఫేస్ బుక్, లింక్డ్ ఇన్, ట్విట్టర్ వంటి సైట్లను పరిశీలిస్తాయని తెలిసిందే. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా, అత్యధికులతో, సవ్యరీతిలో స్నేహ సంబంధాలు కొనసాగించేవాళ్ళకు.. కంపెనీలు స్వాగతం పలికేందుకు సై అంటున్నాయట.

ఈ సోషల్ సైట్ల ద్వారా ఉద్యోగార్థుల కోసం వెతికే కంపెనీలు అభ్యర్థుల నెట్ చాతుర్యంపైనా ఓ కన్నేస్తాయని తెలుస్తోంది. అభ్యర్థులు ఫేస్ బుక్, ట్విట్టర్ లో చేసే పోస్టింగుల్లో పస ఉందా లేదా?, టైంపాస్ కోసం ఖాతా నిర్వహిస్తున్నారా? అనే అంశాలను పరిశీలించిన మీదటే అభ్యర్థికి కాల్ వెళుతుందట. ఇక ఆ అభ్యర్థికి ఉండే స్నేహితుల జాబితా, ఫాలోవర్స్ లిస్టు ఉద్యోగం విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఓ న్యూజిలాండ్ కంపెనీ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా, ఉద్యోగాల కోసం అన్వేషించే యువత 74 శాతం లింక్డ్ ఇన్, 24 శాతం ఫేస్ బుక్, 7 శాతం ట్విట్టర్ ను వినియోగిస్తారని కూడా ఆ సర్వేలో తేలింది.

  • Loading...

More Telugu News