: ఆంధ్రప్రదేశ్ లో వడగాలుల తీవ్రతకు 14 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వడగాలులకు 14 మంది మరణించారు. వడగాలుల తీవ్రతకు తాళలేక విశాఖ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మరణించగా, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ప్రాణాలు విడిచారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు వడగాలులకు మరణించారు.