: పాక్ గడ్డపై అమెరికా డ్రోన్ దాడి


పాకిస్థాన్ లోని గిరిజన ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాలపై 24 గంటల వ్యవధిలో అమెరికా రెండు డ్రోన్ లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 16 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొదటి డ్రోన్ దాడిలో 10 మంది మృత్యువాత పడగా, రెండవ డ్రోన్ దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు కూడా ధ్వంసమైనట్టు అధికారులు వెల్లడించారు. 2013 డిసెంబర్ లో చివరిసారి అమెరికా పాక్ లోని ఉగ్రవాదులపై దాడులు చేసింది. సుదీర్ఘ విరామానంతరం కరాచీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు పంజా విసరడంతో అమెరికా డ్రోన్ దాడులకు తెరతీసింది.

  • Loading...

More Telugu News