: రెచ్చగొట్టే ప్రసంగాలపై స్పందించాలని కేంద్రానికి సుప్రీం నోటీసు


కొందరు రాజకీయ నాయకులు, మత నాయకులు విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలపై పరిమితులు విధించేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఇతరులను ఇబ్బంది పెట్టేలా చేస్తున్న ప్రసంగాలకు అడ్డుకట్టవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రెండు నెలల కిందట విద్వేషాలను రెచ్చగొడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మహారాష్ట్ర లో ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే చేసిన సంచనల వ్యాఖ్యలపై ఓ స్వచ్ఛంధ సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలోతొక్కుతూ.. మతం, కులం, ప్రాంతం అంటూ పలు రకాలుగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఈ ప్రసంగాలు సాగుతున్నాయని ఆ స్వచ్ఛంద సంస్థ తన వ్యాజ్యంలో పేర్కొంది.

దీనిపై జస్టిస్ ఆల్తమస్ కబీర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన బెంచ్ ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదించిన సీనియర్ న్యాయవాది బస్వా పాటిల్.. వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసినా కూడా మళ్లీ అదే రీతిలో రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. కాబట్టి చట్టాలను మరింత బలోపేతం చేయటంవల్ల అలాంటి ప్రసంగాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వాలకు, ఎన్నికల కమిషన్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News