: యూపీ సీఎం నిర్ణయం తీసుకోవాలి: మమతా శర్మ


ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు హద్దుదాటాయని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా శర్మ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో మహిళలు పట్టపగలు కూడా తిరిగే రోజులు పోయాయని అన్నారు. యూపీలో జరుగుతున్న అత్యాచారాలు దేశం మొత్తం సిగ్గుపడేలా చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. వీటికి అడ్డుకట్ట వేయకపోతే అంతర్జాతీయ సమాజంలో భారత్ పరువు ప్రతిష్ఠలు మంటగలిసి పోతాయని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

అత్యాచారాలపై యూపీ సీఎం తక్షణ చర్యలు తీసుకోకుంటే... రాష్ట్రంలో మితిమీరుతున్న అత్యాచారాలు, దేశం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని ఆమె సూచించారు. యూపీ సీఎం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

  • Loading...

More Telugu News