: పేరూరులో అగ్నిప్రమాదం... ఆహుతి అయిన 15 ఇళ్లు
అగ్నిప్రమాదంలో 15 ఇళ్లు తగులబడ్డాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలోని పేరూరులో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రూ. 20 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేశారు.