: తెలంగాణ రాష్ట్రానికి టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్: మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్ కు కేంద్రం అనుమతినిచ్చిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్ నెంబర్ ఇస్తామని ఆయన చెప్పారు. దాని ప్రకారం వాహనాల నెంబర్లు మార్చాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో పాత వాహనాల నెంబర్లన్నీ మార్చుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే నాలుగు నెలల గడువును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కొత్త వాహనాలకు మాత్రం రేపటి నుంచి టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.