: మూడు తీర్మానాలు చేసిన టీ.సీఎల్పీ


అసెంబ్లీలో సమావేశమైన తెలంగాణ సీఎల్పీ రెండు గంటలకు పైగా చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో టీకాంగ్ నేతలు మూడు తీర్మానాలు చేశారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన హామీలపై ఆ పార్టీని నిలదీయాలని నిర్ణయించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించే విధంగా చూడాలని తీర్మానించారు. పోలవరం ఆర్డినెన్స్ ను రద్దుచేయాలంటూ ఉభయసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News