: గత మంత్రుల పీఎస్, పీఏలను నియమించుకోవద్దు: కేసీఆర్ ఆదేశం
పర్సనల్ సెక్రటరీ (పీఎస్), పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)ల నియామకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంక్షలు విధించారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన పీఎస్, పీఏలను ప్రస్తుత మంత్రులెవరూ నియమించుకోరాదని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అలాంటివారిని ఇప్పటికే నియమించుకుని ఉంటే... వెంటనే వారిని తొలగించాలని సూచించారు. కొత్త వారిని నియమించుకోవాలని చెప్పారు.