: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు: ఎంపీ జయదేవ్
తొలిసారి ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై లోక్ సభలో వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు అని చెప్పారు. ఏపీకు ప్రస్తుతం లోటు బడ్జెట్ ఉందన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసే వంద స్మార్ట్ సిటీల్లో మొదటిది ఏపీ రాజధాని కావాలని కోరారు. వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయించడం వల్ల ఎక్కువ వాటా తెలంగాణకు దక్కిందన్నారు. జలాలకు సంబంధించిన అంశాలను రెండు రాష్ట్రాలు ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే స్పష్టత అవసరమని లోక్ సభలో అభిప్రాయపడ్డారు.