: బియాస్ నదిలో విద్యార్థులు ప్రమాదానికి గురైన దృశ్యాలు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో 24 మంది హైదరాబాదు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. విద్యార్థులు ప్రమాదానికి గురైన దృశ్యాలు న్యూస్ వెబ్ సైట్ amarujala.com లో ఉంచారు. నదిలో బండరాళ్లపై ఉన్న విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు... నీటి ప్రవాహం పెరుగుతున్న కొద్దీ సాయం కోసం విద్యార్థులు చేసిన ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న విద్యార్థులను రక్షించేందుకు తోటి విద్యార్థులు వారిని అనుసరిస్తూ కిలోమీటర్ల దూరం పరుగెత్తి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.