: ముండే మృతిపై సీబీఐ విచారణకు గడ్కరీ డిమాండ్


కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని స్వయంగా మరో కేంద్ర మంత్రి గడ్కరీ డిమాండ్ చేశారు. ఈ నెల 3న ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, కేంద్ర మంత్రి గడ్కరీ, మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫద్నావిస్ ఈ రోజు కలుసుకున్నారు. ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News