: శాఖల కేటాయింపుపై చంద్రబాబు మంతనాలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చలు జరుపుతున్నారు. మంత్రులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబుతో మంత్రి అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. ఈ నెల 12న జరిగే మంత్రివర్గ సమావేశం గురించి కూడా వీరు చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 8న సాయంత్రం చంద్రబాబు ముఖ్యమంత్రిగా, 19 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. వారికి శాఖలు కేటాయించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News