: ఇక దేశమంతటా ఒకటే రేటు!
‘వన్ ఇండియా వన్ రేట్’ పేరుతో ఉచిత రోమింగ్ ప్లాన్ ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఎస్టీడీ, లోకల్, రోమింగ్ కాల్స్ కు ఇక ఒకటే రేటు వర్తిస్తుంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ రూ. 599, 350 రూపాయలతో రెండు ప్లాన్ లను ప్రవేశపెట్టింది. లోకల్, ఎస్డీడీ, రోమింగ్ టారిఫ్ లలో వ్యత్యాసాలు లేకుండా వినియోగదారులకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సీఈవో గురుదీప్ సింగ్ చెప్పారు.