: చండీగఢ్ నుంచి హైదరాబాదుకు బయల్దేరిన 22 మంది విద్యార్థులు
చండీగఢ్ నుంచి హైదరాబాదుకు బయల్దేరిన విమానంలో 22 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు రాత్రి 9.30కి హైదరాబాదుకు చేరుకుంటారు. నాలుగు మృత దేహాలను మరో ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తీసుకువస్తున్నారు. ఈ విమానం రాత్రికి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది.
హిమాచల్ ప్రదేశ్ ప్రమాదంపై ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో ఇవాళ ఉదయం కేసీఆర్ మాట్లాడారన్నారు. హిమాచల్ ఘటనలో యాజమాన్యం తప్పుంటే చర్యలు తీసుకుంటామని హరీష్ రావు చెప్పారు.