: కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యా పథకాన్ని అమలు చేస్తా: జగదీష్ రెడ్డి
కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యా పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో డ్రాపౌట్స్ తగ్గిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తి అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు.