: విశాఖ జిల్లాలో జీపు బోల్తా
విశాఖ జిల్లాలో ఓ జీపు బోల్తా పడింది. పెదబయలు మండలంలోని అడుగులపుట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు.