: ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఆదేశించిన చంద్రబాబు


హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షించారు. తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విమానంలో చండీఘడ్ వరకు తీసుకెళ్లి... అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఘటనా స్థలికి తీసుకెళ్తామని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. 60 నుంచి 65 మంది వరకు తల్లిదండ్రులను ఈ విమానంలో తీసుకెళ్తామని తెలిపారు. సతీష్ చంద్ర అనే ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలన్నింటినీ సమీక్షిస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News