: రాజధాని నిర్మాణం కోసం నెంబర్.1 కూలీగా పని చేస్తా: చంద్రబాబు
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకున్న ప్రజలదే ఈ విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ విజయం కోసం పనిచేసిన అందరికీ పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు ప్రజలందరి సహకారం కావాలని కోరారు. రాష్ట్రానికి గొప్ప రాజధానిని నిర్మించేందుకు తాను నెంబర్ వన్ కూలీగా పనిచేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పోలవరం ఆర్డినెన్సును తెచ్చేందుకు ఎంతో శ్రమించారని కొనియాడారు. వికేంద్రీకరణతో రాష్ట్ర నలుమూలల్నీ డెవలప్ చేస్తామని తెలిపారు.