: అతిరథ మహారథులను పరిచయం చేసిన వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సభకు పరిచయం చేశారు. బీజేపీ కురు వృద్ధుడు అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్, రమణ్ సింగ్, వసుంధర రాజే సింధే, ఆనందీబెన్ పటేల్, నిధియాగ్ జలన్, సుఖ్ వీర్ సింగ్ బాదల్, మురళీ మనోహర్ జోషీ, ఉద్దవ్ ఠాక్రే, అనంతకుమార్, అశోక్ గజపతిరాజు, కల్రాజ్ మిశ్రా, హర్షవర్ధన్, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్, వైగో, పీజే కురియన్, ఆర్.వైద్యలింగం, బాబ్జీ, అభయ్ చౌతాలా, నరేష్ గుజ్రాల్, విజయ్ గోయల్, సీపీఐ నారాయణ, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్), పవన్ కల్యాణ్, వివేక్ ఓబెరాయ్ లను వెంకయ్యనాయుడు సభికులకు పరిచయం చేశారు.