: గుంటూరు టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు


గుంటూరు జిల్లా టీడీపీలో చిచ్చు రేగింది. పదవుల పందేరంలో చోటుదక్కలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నిరసన గళం విప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిస్తే మోదుగుల వేణుగోపాలరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు ఆయనకు మొండిచేయి చూపారని ఆరోపిస్తూ గుంటూరు టీడీపీ కార్యాలయంపై ఆయన అనుచరులు దాడికి దిగారు.

మరో నేత ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు అతనికి గృహ నిర్బంధం విధించారు. టీడీపీ అధినేత ప్రమాణ స్వీకారానికి హాజరుకాకుండా అతనిని ఇంట్లో పెట్టి తాళం వేశారు. ఇప్పటికైనా మంత్రి పదవులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News